తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే కుటుంబ ప్రేక్షకులు, పండగ వాతావరణంతో పాటు ఉత్సాహభరితమైన సంగీతం గుర్తుకు వస్తాయి. అలాంటి సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో తనదైన ముద్ర వేస్తున్నారు. 2025లో పండగ వైబ్‌ను సెట్ చేసిన భీమ్స్.. 2026 సంక్రాంతిని కూడా తన సంగీతంతో ఓన్ చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సంక్రాంతికి…