Bheemla Nayak ఫిబ్రవరి 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా “భీమ్లా నాయక్” వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మార్చి 25న “భీమ్లా నాయక్” ఓటిటిలో విడుదల కానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ విడుదల ప్రణాళికను వాయిదా వేసింది సదరు ఓటిటి సంస్థ. కానీ గుడ్ న్యూస్ఏంటంటే ముందుగా అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Rowdy Pictures: చిక్కుల్లో నయన్, విఘ్నేష్!
“భీమ్లా నాయక్” ఈ నెల 24న ఉదయం 12 గంటల నుంచి ఆహా వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. ఈ రెండు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. ఓటిటిలో 4K రిజల్యూషన్, డాల్బీ 5.1 సౌండ్‌లో ప్రసారం చేస్తున్న మొట్ట మొదటి చిత్రం “భీమ్లా నాయక్” అని ఆహా ప్రకటించింది. అంతేకాకుండా ఒకే రోజు రెండు వేర్వేరు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఒక సినిమాను ప్రీమియర్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మరోమారు ఖుషీ అవుతున్నారు. ఒకరోజు ముందుగానే తమ అభిమాన హీరో సినిమాను మరోమారు చూసి ఆనందించొచ్చని !
