మహిళ..నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.. తల్లిగా, భార్యగా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇక పోలీస్ ఉద్యోగం అంటే కేసులు, క్రైమ్ లు.. రోజూ డ్యూటీ.. కనీసం వారికి బయటికి వెళ్లే సమయం కూడా ఉండదు. దీంతో ఒక్కరోజు ఆ మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్ సినిమా ఉచితంగా చూపించనున్నారు. దీంతో మహిళా పోలీస్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు కమీషనర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈరోజు అన్ని బాధలు మరిచి సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.