లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. నేడు హైదరాబాద్ మొత్తం వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నా భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఇప్పటినుంచే రచ్చ షురూ చేశారు.
మరికొద్దిసేపటిలో మొదలుకానున్న ఈ వేడుక వద్ద ఇప్పటికే పవన్ అభిమానుల హంగామా మొదలు అయిపోయింది. పవన్ కటౌట్ లు, ఫ్లెక్సీలతో పోలీస్ గ్రౌండ్స్ కళకళలాడుతోంది. ఆ గ్రౌండు అంతా సీఎం..సీఎం అనే అరుపులతో దద్దరిల్లిపోతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వేదికపైకి రానున్నారు. మరి ఆయన స్పీచ్ తో ఈ వేడుక దద్దరిల్లిపోతుంది అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.