Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse: సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే హీరోయిన్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. అదే సమయంలో వరుస సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు అందుకుంటూ, క్రేజ్‌ను పెంచుకుంటున్న హీరోయిన్లు కూడా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా.. ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. హిందీ సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంది.
ఆ తర్వాత ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’, రామ్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాల్లో కనిపించింది. అయితే వీటిలో చాలా సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేదు. ముఖ్యంగా ‘కాంత’లో దుల్కర్ సల్మాన్‌తో పోటీగా నటించి తన పెర్ఫార్మెన్స్తో మెప్పించింది. అయినప్పటికీ సినిమా రిజల్ట్ మాత్రం ఆమెకు అనుకూలంగా మారలేదు. తాజాగా ‘లెనిన్’ సినిమాతో భాగ్యశ్రీకి మంచి గుర్తింపు దక్కిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు తీసుకున్న ఆమె.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ‘కాంత’ ఫ్లాప్ అయినప్పటికీ.. కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘సీయోన్’లో అవకాశం దక్కించుకున్నారు. మొత్తానికి ఫ్లాపులు ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
తాజావార్తలు
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!