అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు అందరికన్నా ముందు యూత్ థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు. సింహా, లెజెండ్, అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బాలయ్య గ్రాఫ్ అమాంతం పెరిగింది. బాలయ్య అనే హీరో వంద కోట్ల కలెక్షన్స్ ని రాబడతాడని ట్రేడ్ వర్గాలు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటిది బాలయ్య బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ఏకంగా హ్యటిక్ హండ్రెడ్ క్రోర్ కొట్టడానికి బాలయ్య రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి సక్సస్ ట్రాక్, బాలయ్య హిట్ స్ట్రీక్, థమన్ థంపింగ్ మ్యూజిక్, ఫెస్టివల్ సీజన్ అన్నీ కలిసి భగవంత్ కేసరి సినిమాని మరో వంద కోట్ల ప్రాజెక్ట్ గా మారుస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పై ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమాని రెడీ చేస్తున్నారు అనీల్ రావిపూడి అండ్ టీమ్. అక్టోబర్ 19 రిలీజ్ డేట్ మిస్ చేయకుండా టార్గెట్ తో పని చేస్తున్న అనీల్ రావిపూడి పెండింగ్ ఉన్న ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలన్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట. భగవంత్ కేసరి డబ్బింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డ్యూటీ ఎక్కాడు. బాలయ్య అనగానే డబుల్ ది జోష్ తో మ్యూజిక్ కొడుతున్న థమన్… అఖండ, వీరసింహా రెడ్డి సినిమాల హిస్టరీని రిపీట్ చేయడానికి చెన్నై నుంచి మ్యుజిషియన్స్ ని తీసుకొచ్చి మరీ భగవంత్ కేసరి ఆర్ ఆర్ వర్క్ చేస్తున్నాడట. థమన్ కరెక్ట్ గా డ్యూటీ ఎక్కితే చాలు బాలయ్య సినిమా సగం హిట్ అయిపోయినట్లే.