Site icon NTV Telugu

Beast: తెలుగు ‘అరబిక్ కుత్తు’ వచ్చేసిందోచ్..

Beast

Beast

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా  అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా వైరల్ గా మార్చారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో హీరో శివ కార్తికేయన్ రాసిన లిరిక్స్, అనిరుధ్  మెస్మరైజ్ వాయిస్  తో ఈ సాంగ్ రికార్డులు బద్దలుకొట్టింది.

ఇక అంతటి సంచలన సాంగ్ ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటివరకు బీస్ట్  ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనీ అనుకోలేదు మేకర్స్.. కానీ విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ ని చూసి అందులోను మాస్టర్’ సినిమాతో విజయ్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇప్పుడు ”బీస్ట్” చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో కూడా బీస్ట్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా తెలుగు అరబిక్ కుత్తు లిరికల్ విడానూ మేకర్స్ రిలీజ్ చేశారు.  శ్రీ సాయి కిరణ్ రాసిన తెలుగు లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో కూడా అరబిక్ కుత్తు ఫీవర్ మొదలైపోయింది. మరి మాస్టర్ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version