Barrelakka: కాబోయే భర్తతో వీడియో వదిలిన బర్రెలక్క.. ఎవరో, ఎలా ఉన్నాడో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barrelakka Pre Wedding Shoot Video goes viral: తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి ఆమె అసలు పేరు శిరీష కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ చేసిన వీడియో వల్ల ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు కూడా పెట్టారు నెటిజనులు. రాజకీయాల మీద ఆసక్తి ఉందో లేక నిజంగానే నిరుద్యోగుల సమస్యల మీద పోరాడాలి అని నిర్ణయించుకుందో కానీ ఆమె గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేసి దాదాపు 5 వేల పైచిలుకు ఓట్లు సాధించింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఆమె పోటీ చేయడంతో రామ్ గోపాల్ వర్మ, వైఎస్ జగన్ వంటి వాళ్లు కూడా ఆమె పేరును ప్రస్తావిస్తూ పలు సార్లు వ్యాఖ్యలు కూడా చేశారు.
Naga Chaitanya: ప్రేక్షకుల్ని వణికించిన డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన చైతూ
Also Read
అయితే ఆమె పోటీ చేసిన సమయంలో ఆమెకు వివాహం చేస్తే ఎక్కువ కాలం నిలుపుకోలేక విడాకులు తీసుకున్నట్లు ఆమె తండ్రి తెరమీదకు వచ్చి కొన్ని ఆరోపణలు కూడా గుప్పించారు. అదలా ఉంచితే తాను వివాహానికి సిద్ధమైనట్లు కొద్దిరోజుల క్రితం బర్రెలక్క ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమెకు ఎంగేజ్మెంట్ నిమిత్తం మేకప్ చేస్తున్నట్లు కనిపించింది. ఇక ఇప్పుడు తన కాబోయే భర్తతో కలిసి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కాబోయే భర్త పేరు వెంకటేష్. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు. ఫిజిక్స్ ఎమ్ఎస్సి చదువుకున్న వెంకటేష్ జాబ్ చేస్తుండగా పెద్దలు ఈ సంబంధం కుదర్చినట్టు చెబుతున్నారు. ఇక మార్చి 28న వెంకట్-శిరీషల వివాహం నాగర్ కర్నూల్ లో ఘనంగా జరగనుంది. త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్న క్రమంలో గతంలో ప్రకటించిన విధంగానే బర్రెలక్క పోటీ చేస్తుందే లేక పెళ్లి చేసుకుంటోంది కాబట్టి గృహిణిగా ఇంటికే పరిమితం అవుతుందో ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!