ఇండియన్ ఐడల్ సింగర్స్ పై బప్పీలహరి కానుకల వర్షం!
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఇండియన్ ఐడల్ 12 సింగర్స్ ను ఆదివారం ఆనందంలో ముంచెత్తారు. స్టార్ కంపోజర్ ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భిన్నమైన బహుమతులు ఇచ్చి వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతులకు గురిచేశారు. అరునిత కంజీలాల్ తో పని కట్టుకుని బెంగాలీ పాటను పాడించుకున్న బప్పీలహరి ఆమెకు ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు రికార్డింగ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. అలానే సైలీ కుంబ్లే పాడిన పాటలకు ఫిదా అయిపోయిన బప్పీలహరి ఆమె నివాసం ఉండే ఇంటిలోని పర్శనల్ రూమ్ ను రెన్నోవేట్ చేసి బహుమతిగా ఇచ్చారు. ఆమె గదిని అందంగా మార్చడంతో పాటు అక్కడ ఖరీదైన టీవీని ఏర్పాటు చేశారు.
ఇక తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాడిన పాటలకూ బప్పీలహరి ఖుషీ అయిపోయారు. విశేషం ఏమంటే.. ఇదే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ దర్శకుడు ఒమంగ్ కుమార్ షణ్ముఖ ప్రియతో తన కొత్త చిత్రంలో ఓ పాట పాడిస్తానని మాట ఇచ్చి, ఆ తర్వాత అన్ని పాటలూ ఆమెతోనే పాడిస్తానని చెప్పారు. అంతేకాదు… స్టేజ్ మీదనే ఐదు నిమిషాల్లో షణ్ముఖ ప్రియ స్కెచ్ ను అద్బుతంగా గీసి, ఒమంగ్ కుమార్ ఆమెకు బహుమతిగా ఇవ్వడం మరో విశేషం. ఇక పవన్ దీప్ రాజన్ కు బప్పీలహరి తన తబ్లాను కానుకగా ఇచ్చారు. చివరగా సింగర్ నిహాల్ గానానికి ముగ్ధుడైన బప్పీలహరి బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమం 70 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ కేక్ ను తెప్పించి అందరి సమక్షంలో కట్ చేయించారు బప్పీలహరి. మొత్తం మీద ఈ సంచలన సంగీత దర్శకుడు… ఇండియన్ ఐడిల్ సింగర్స్ కు తనదైన శైలిలో శుభాశీస్సులు అందించారు.
Also Read
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..
-
Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
-
CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం
-
Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
-
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!”
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!