టాలీవుడ్ సినీయర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వరుస విజయలతో జోష్ మీదున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ అందుకున్నారు. కథ రొటీన్ అనిపించిన టెక్నీకల్ గాను విజువల్ గాను బెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా నిలిచింది ఆ చిత్రం. అదే ఎనర్జీతో ప్రస్తుతం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్ గా అఖండ -2 సినిమా చేస్తున్నాడు బాలయ్య.
Also Read : GBU : అజిత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తప్పిన ప్రమాదం..
ఈ సినిమాతో పాటు మరికొందరు దర్శకులు కథలు వినే పనిలో ఉన్నాడు బాలయ్య. దర్శకుడు హరీష్ శంకర్ బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు మీటింగ్స్ కూడా జరిగాయి. త్వరలోనే బాలయ్య కు పూర్తి నెరేషన్ ఇవ్వబోతున్నారట. అన్నీ కుదిరితే ఈ సినిమా కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. అలాగే మరొక స్టార్ దర్శకుడు బాలయ్యతో వీరసింహ రెడ్డి వంటి హిట్ సినిమా ఇచ్చిన గోపిచంద్ మలినేని ఆ మధ్య బాలయ్యకు మరో కథ వినిపించాడు. ఈ కథకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దర్శకుడు జాట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ హడవిడి ముగిసాక బాలయ్య సినిమా అనౌన్స్ మెంట్ ఉండబోతుంది. అలాగే తమిళ దర్శకుడు సినిమాలో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇవి కాకుండా మరో ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు విన్న బాలయ్య ఇంకా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.