Balakrishna: అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ తాజాగా నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడాడు. “దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీ తో వుంటుంది.
Thaman: నా కడుపు నింపిన మనిషి బాలకృష్ణ..
Also Read
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
అనిల్ రావిపూడి భిన్నమైన సినిమాలు చేశారు. ముందు మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ తో పటాస్ చేశాడు. అందులో కూడా నా పాటని రీమిక్స్ చేశాడు. ఆయన సినిమాలు గమనిస్తే అన్నీ డిఫరెంట్ గా వుంటాయి. చాలా అద్భుతమైన కథతో వచ్చారు. మేమిద్దరం ఈ సినిమా ఒక సవాల్ గా తీసుకున్నాం. చాలా హోం వర్క్ చేశాం. నేను ఏది చేసినా నా అభిమానులని దృష్టిలో పెట్టుకుంటాను. భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇంకా గొప్పగా అలరిస్తుంది. నటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి తను కోరుకున్నది రాబట్టుకునే దర్శకుడు అనిల్. ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం. తమన్ అఖండతో బాక్సులు బద్దలగొట్టాడు. చాలా ప్రతిభావంతుడు. అద్భుతమైన పాటలు నేపధ్య సంగీతం అందించాడు. అలాగే రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన డీవోపీ. నా ప్రతి కదలిక తనకి తెలుసు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాం. తన కెమరా ద్వారా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారో ప్రేక్షకులు చూస్తారు. కాజల్ అద్భుతమైన నటి. చాలా మంచి పాత్ర చేశారు. ఒక విస్పోటనం జరిగితే గానీ ఇలాంటి కలయిక జరగదు. విస్పోటనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మా భగవంత్ కేసరి. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు. అంత అద్భుతంగా వచ్చింది మా మధ్య కెమిస్ట్రీ. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తపన శ్రీలీలలో వుంది. అందుకు అభినందనలు.
India vs Pakistan: “ప్రేమ దుకాణం ” నుంచి ఒక్క పలుకు రాలేదు.. కాంగ్రెస్‌పై అస్సాం సీఎం ఫైర్..
అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారు. తనే డబ్బింగ్ చెప్పారు. ప్రతి పాత్ర అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. సినిమా చాలా కూల్ మొదలౌతుంది. తర్వాత దబిడి దిబిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతుంది. నిర్మాతలు హరీష్, సాహు చాలా అద్భుతంగా సినిమాని నిర్మించారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ… ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతచక్కగా ఈ ఇందులో పాత్రలని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తనో మళ్ళీ కలసి పని చేయడానికి ఎదురుచూస్తుంటాను. 19న మా భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం వుంటుంది. అందరికీ ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు.
అనిల్ రావిపూడిని జురాసిక్ పార్క్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో పోల్చిన బాలయ్య బాబు..!!#AnilRavipudi #NandamuriBalakrishna #BhagavanthKesari #KajalAgarwal #SreeLeela #NTVENT #NTVTelugu pic.twitter.com/cYw0ImVzDu
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) October 15, 2023
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!