NTV Telugu Site icon

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. తారకరత్న మృతిపై బాలయ్య ఎమోషనల్ పోస్ట్

Balayya On Tarakaratna

Balayya On Tarakaratna

Balakrishna Emotional Post On Tarakaratna Demise: నందమూరి తారకరత్న మృతి అటు సినీ పరిశ్రమ, ఇటు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మృత్యువుతో పోరాడి ఆరోగ్యంగా తిరిగి వస్తాడనుకున్న తారకరత్న.. తిరిగిరాని లోకాలకువెళ్లిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా ఫేస్‌బుక్‌లో తారకరత్న మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తనని బాల బాబాయ్ అని పిలిచేవాడని.. ఇకపై ఆ పిలుపు వినబడదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటు అని పేర్కొన్నారు.

Taraka Ratna: ‘మోకిల’కి తారకరత్న భౌతికకాయం…

‘‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు, ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబసభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు.. మృత్యుంజయుడై తిరిగి వస్తాడనుకున్న తారకరత్న, ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’’ అంటూ బాలయ్య కన్నీరుమున్నీరు అయ్యారు. కాగా.. తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. బాలయ్య పలుసార్లు ఆసుపత్రికి హాజరయ్యారు. అతని ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ వచ్చిన ఆయన.. తిరిగి కోలుకోవాలని ప్రార్థించారు.

Bapatla Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఇదిలావుండగా.. నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న, జనవరి 26న కుప్పంలో హార్ట్‌అటాక్‌తో కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. నిన్న చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి టాలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్న మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ తారలు, రాజకీయ నాయులతో పాటు ప్రముఖులు తారకరత్న మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Nandamuri Tarakaratna: తారకరత్న మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Show comments