Site icon NTV Telugu

Balakrishna : అభివృద్ధి చేశా కాబట్టే ఆదరిస్తున్నారు.. బాలకృష్ణ కామెంట్స్

Mla Balakrishna

Mla Balakrishna

Balakrishna : సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన బాలకృష్ణ మాట్లాడుతూ, “తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. “2024లో వచ్చిన విజయంతో తెలుగు దేశం పార్టీ మరో కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో టిడిపితో తలపడే శక్తి ఎవరికీ ఉండదు అంటూ తెలిపారు.

Read Also : Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ డేట్ లో మార్పు..

ఎన్టీఆర్ కొడుకుగా నాకు మొదటిసారి హిందూపురంలో అవకాశం ఇచ్చారు. కానీ ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గెలవడం మాత్రం నేను చేసిన అభివృద్ధి వల్లే సాధ్యమైంది. ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఒక్కసారి మాత్రమే ఆదరిస్తారు. కానీ నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పనిచేశాను కాబట్టే ప్రజలు నన్ను నిలబెట్టారు. సినిమాలు అంటే అరవడం, నవ్వడం, ఏడవడం కాదు. ఒక పాత్ర చేయడం అంటే ఒక ఆత్మలోకి ప్రవేశించడం. అందుకే నేను చేసే ప్రతి పాత్రకు ప్రాణం పెడతాను అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also : Pawan Kalyan – Mahesh Babu : మొన్న పవన్ కల్యాణ్‌.. నేడు మహేశ్ బాబు.. అదే రిపీట్

Exit mobile version