నందమూరి అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించినట్లుగానే బాలయ్య అదరగొట్టాడు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని,సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లు కాస్త ల్యాగ్ అనిపించిన్లుగా తెలిపారు.ఇక తమన్ కూడా మూవీకి సమన్యాయం చేశాడట. బీజీఎం అదిరిపోగా, టెక్నికల్ గా అయితే ఈ సినిమాను బ్రిల్లియంట్ తీశారట.
మరి కొంత మంది బాలయ్యని స్టైలీష్‌గా, సటిల్డ్‌గా చూపించండంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. మాస్ ఆడియెన్స్‌కు పిచ్చెక్కేలా సీన్లను డిజైన్ చేశారు. అంత బాగున్నప్పటికీ కథలో మాత్రం ఎక్కడా కూడా సస్పెన్స్ మాత్రం కనిపించలేదట, నెక్ట్స్ ఏం జరుగుతుందో ఆడియెన్స్‌కు ఇట్టే అర్థం అవుతుందట. అయినప్పటికి బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, బాబీ డైరెక్షన్, ఎలివేషన్.. ఇండియన్ స్క్రీన్ మీద ది బెస్ట్ విజువల్స్ అవుతాయని, తమన్ ఇచ్చిన బీజీఎంకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఒకటే మాట బాక్స్ ఆఫీస్ ని హైజాక్ చేసిన బాలయ్య అంటు ట్వీట్ చేస్తున్నారు.