Unstoppable-2 Promo: నందమూరి- నారా వారి అనుబంధంతో ‘అన్ స్టాపబుల్-2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable-2 Promo: “సదా నన్ను కోరుకునే మీ అభిమానం… ‘అన్ స్టాపబుల్’ను టాక్ షోలకి అమ్మ మొగుడిగా చేసింది…” అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ విజయగర్జన చేశారు. ఈ ముచ్చట ‘అన్ స్టాపబుల్’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోలో చోటు చేసుకుంది. ఈ ప్రోమో మంగళవారం సాయంత్రం జనం ముందుకు వచ్చింది. దాదాపు ఐదు నిమిషాలు సాగిన ఈ ప్రోమోలో బాలకృష్ణ ఆరంభంలోనే బైక్ పై విచ్చేయడం, ఎంతో హుషారుగా కేకలు వేస్తూ అక్కడ పాల్గొన్న అభిమానుల్లో ఉత్సాహం నింపడం కనిపించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా పాల్గొనడం విశేషం! “ఈ సారి మా బంధువును ముందుగా పిలుద్దామనుకున్నా… కానీ, ప్రజలందరి బంధువును పిలిస్తే బాగుంటుందనుకున్నా… అందుకే మీకు బాబుగారూ… నాకు బావగారూ…” అంటూ చంద్రబాబు నాయుడుకు బాలయ్య స్వాగతం పలకడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది.
“నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి…” అంటూ బాలయ్య చెప్పడం, “అయితే వసుంధరకు కూడా చెబుదాం… బ్రేకింగ్ న్యూస్ ఇది…” అంటూ చంద్రబాబు మాట కలపడం మురిపించింది. “మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి…” అన్నది బాలయ్య ప్రశ్న, దానికి చంద్రబాబు “మీ కంటే ఎక్కువ చేశా…” అంటూ జవాబివ్వడం అలరించింది. “మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?” అన్న ప్రశ్నకు చంద్రబాబు “రాజశేఖర్ రెడ్డి…” అని చెప్పడమూ ఆకట్టుకుంది. 1995లో అందరూ కలసి తీసుకున్న ‘బిగ్ డెసిషన్’ గురించి కూడా చర్చకు వచ్చింది. ఈ షో మధ్యలో చంద్రబాబు తనయుడు, బాలయ్య పెద్దల్లుడు లోకేశ్ కూడా పాల్గొనడం మరింతగా ఆకట్టుకుంది. లోకేశ్ ను మంగళగిరి ఎన్నికల ఫలితం గురించి అడగడమూ ఆసక్తి కలిగించింది. తరువాత బాలయ్య సీట్ లోకి లోకేశ్ మారి ప్రశ్నలు కురిపించడమూ మురిపించింది. ఇందులో కేవలం రాజకీయాలే కాకుండా, నందమూరి- నారావారి కుటుంబాల అనుబంధాన్నీ ముచ్చటించుకోవడం అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. ఇలా పలు విశేషాలతో ముస్తాబయిన ఈ ప్రోమోనే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంటే, మరి ఎపిసోడ్ ను మొత్తం చూసేయాలన్న తలంపు కలగకుండా ఉంటుందా? ఈ నెల 14 నుండి ప్రతి శుక్రవారం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దర్శనమిచ్చే ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ ఏ తీరున అలరిస్తుందో చూద్దాం.
Also Read
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
https://www.youtube.com/watch?v=jGMH_luXetg&feature=youtu.be
తాజావార్తలు
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!