Site icon NTV Telugu

Bhagavanth Kesari: ఈ గౌరవం వారికే.. జాతీయ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ!

Bhagavanth Kesari

Bhagavanth Kesari

Balakrishna Reacts to Bhagavanth Kesari Winning National Award: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపికైంది. భగవంత్ కేసరికి జాతీయ అవార్డు దక్కడంపై ఇప్పటికే చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించగా.. తాజాగా బాలయ్య బాబు స్పందించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికవడం ఎంతో గర్వకారణం అన్నారు. ఈ గౌరవం చిత్ర బృందానికే చెందుతుందని పేర్కొన్నారు.

Also Read: Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌.. జట్టులో విరాట్, షమీ, జైస్వాల్..!

’71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ గౌరవం చిత్ర బృందానికే దక్కుతుంది. కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి-హరీశ్‌ పెద్ది, నటులు, సాంకేతిక నిపుణులు.. అందరి కృషి వల్లే ఈ విజయం దక్కింది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అవార్డు అందుకున్న అందరికీ నా అభినందనలు. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తిని ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇంకా మంచి కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేసింది’ అని బాలయ్య బాబు పేర్కొన్నారు.

Exit mobile version