నందమూరి బాలకృష్ణ సెలబ్రిటీ షో ‘అన్‌స్టాపబుల్’ స్మాషింగ్ హిట్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులు బాలయ్య హోస్టింగ్ ఎనర్జీతో థ్రిల్ అయ్యారు. ఇప్పుడు ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ షోకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక హాజరయ్యారు. ముందుగా ఊహించినట్లుగానే ‘పుష్ప’ టీం అక్కడే ఉన్నప్పటికీ బాలకృష్ణ షోని డామినేట్ చేయడంతో పాటు పుష్ప పాత్రలో ఆయన మ్యానరిజమ్స్ హైలైట్‌గా నిలిచాయి.
ఇక షోలో సుకుమార్ పై బాలకృష్ణ, బన్నీ సెటైర్లు వేయడం అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ కన్ఫ్యూజన్ తన పెద్ద బలహీనత అని చెప్పాడు. వెంటనే బాలయ్య అందుకుని తనకు తగినంత క్లారిటీ ఉందని, తనతో సినిమా చేస్తే మూడు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయగలమని పంచ్ వేశారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ‘పుష్ప 2’ తర్వాత తాను, సుకుమార్ సినిమా చేస్తున్నామని, కేవలం మూడు నెలల్లో సినిమాను పూర్తి చేస్తామని బాలయ్య చెప్పారు.
అల్లు అర్జున్ చిరునవ్వుతో బదులిస్తూ “సుకుమార్ గందరగోళానికి ముగింపు పలికేందుకు మీలాంటి నటులు ఆయనతో కలిసి పని చేయాలి” అని అన్నారు. దీంతో బాలయ్య త్వరలో సుకుమార్ తో కలిసి తాను చేయబోయే సినిమాను దసరాకి ప్రారంభించి క్రిస్మస్ నాటికి పూర్తి చేస్తానని అన్నారు. అంతేకాదు ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని చెప్పుకొచ్చారు. ‘పుష్ప’లోని ఒక సాంగ్ కు బాలకృష్ణ రష్మికతో కలిసి స్టెప్పులేయడం తాజా ఎపిసోడ్ లోని ప్రధాన హైలైట్లలో ఒకటి.