Jr NTR : ఎన్టీఆర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర 2 ఇప్పట్లో లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ చేసారు.
Also Read : Mass Jathara OTT : ఓటీటీలోకి మాస్ జాతర.. ఎప్పుడు ఎక్కడంటే?
Also Read
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ను చేసేందుకు ఆసక్తి చూపడం లేదని అందుకే ఇతర సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించాడు. కొరటాల శివ కూడా ఈ చిత్రం కోసం మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు టాక్ కూడా వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీక్వెల్స్ ను కాస్త పక్కన పెట్టి ఇతర కథలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ కాదంటే కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
-
Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
-
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!