మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాకు భాను భోగవరపు అనే డెబ్యూడెంట్ దర్శకత్వం వహించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం అక్టోబరు 31న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
Also Read : Thalaivar173: రజనీకాంత్ 173 ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ సెట్.. త్వరలోనే అనౌన్స్‌మెంట్
కానీ ప్రీమియర్ షో నుండే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ రెగ్యులర్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు విసుగుతెప్పించాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ క్రింజ్ కామెడి నవ్వుతెప్పించకపోగా విసిగించింది. కనీసం మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది. రిలీజ్ కు ముందే మాస్ జాతర డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్ లో ప్లాప్ అయినా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 28 నుండి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్ లో రిలిజ్ అయిన 28 రోజుల తర్వాత మాస్ జాతర ను స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. మరి ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ రాబడుతుందో చూడాలి.