Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. మేకర్స్ సైతం మెగా బ్రదర్స్ ను ఒక చోట కలపడానికి సన్నాహాలు కూడా చేయాలనుకున్నారు. దీంతో ఒకే వేదికపై చిరు- పవన్ కనిపిస్తారని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఈసారి కూడా నిరాశే ఎదురయ్యింది తెలుస్తోంది. పవన్.. ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు లేవని సమాచారం.
ఎందుకంటే ప్రస్తుతం పవన్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. దసరా తరువాత కానీ ఇండియాలో అడుగుపెట్టడట. దీంతో మేకర్స్. పవన్ ను సంప్రదించిన ప్రయోజనం లేదని, అందుకే వారు ఆయనను అడగలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఈవెంట్ గెస్ట్ లేకుండానే జరగనున్నదట. ఇక మరోపక్క అన్న చిరంజీవి కోసం ఏదైనాచేసే పవన్.. అన్న పిలిస్తే ఖచ్చితంగా వచ్చేస్తాడు. కానీ, పవన్ పనిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చిరు ఈవెంట్ కు వద్దు అన్నారని టాలీవుడ్ టాక్. పవన్ పనికి ఎప్పుడు తానూ అడ్డు చెప్పనని చెప్పే చిరు ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్న పవన్ ను తన ఈవెంట్ కోసం పిలవడం పద్దతి కాదని, అందుకే పవన్ ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారట. ఏదిఏమైనా గాడ్ ఫాదర్ తో జనసేనాని ఒకే వేదికపై కనిపిస్తే ఆ సీన్ చూడడానికి రెండు కళ్లు చాలవని, కానీ ఈసారి అది మిస్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.