Baby The Movie 4 Days Collections: చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, జర్నలిస్టు నుంచి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించారు. సుమారు నాలుగున్నర కోట్ల వరకు బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూనే కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. మొదటి రోజు రెండు కోట్ల 60 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల 98 లక్షలు మూడో రోజు మూడు కోట్ల 77 లక్షలు వసూలు చేసింది.
Sreeleela: వరుస ఆఫర్లు .. ఓవర్ నైటే మైండ్ బ్లాకయ్యే డెసిషన్
ఇదంతా ఒక ఎత్తు అయితే సోమవారం నాడు అంటే వర్కింగ్ డే కూడా భారీగా వసూళ్లు రాబట్టి ఏకంగా మూడు కోట్ల 72 లక్షల వరకు వసూలు చేసింది. అంటే ఆదివారం కంటే కేవలం 5 లక్షలు మాత్రమే తక్కువ వసూలు చేసింది. వర్కింగ్ డే రోజు థియేటర్లకు జనాలను రప్పించడం అంత ఈజీ కాదు కానీ బేబీ ఈజీగా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను 13 కోట్ల ఏడు లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 22 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో మూడు రోజులకు 56 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో దాదాపుగా కోటి 78 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 41 లక్షలు షేర్ వసూలు చేసిన ఈ సినిమా 208 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ ఏడుకోట్ల 40 లక్షలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 8 కోట్ల నిర్ణయించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేయడమే కాదు 7 కోట్ల 41 లక్షల లాభాలతో ఈ సినిమా దూసుకుపోతోంది.