Baby producer SKN clarifies on the attack on media person at Bhimavaram: బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. బేబీ సినిమా ప్రమోషన్‌స్లో భాగంగా భీమవరానికి వెళ్లిన ఆయనకు అక్కడి జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ప్రతినిధులకు, ఎస్‌కేఎన్ మధ్య కాస్త రసాభాస జరిగినట్టుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చుట్టూ ఉన్న బౌన్సర్లు మీడియాను ప్రతిఘటిస్తుండగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవగా ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు విషయం ఏమిటి అనే అంశం మీద ఎస్‌కేఎన్ స్పందించారు. సినిమా వాళ్ళు వస్తున్నారు అంటే మామూలుగానే జనం ఎక్కువగా వస్తారు, వారితో లోకల్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. జనం మా దగ్గరకు వచ్చేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయంలో బౌన్సర్లు ముందుగా మా టీము వాళ్ళని సేవ్ చేయడానికి చూస్తారని ఆయన అన్నారు. అంత క్రౌడ్ ఒక్కసారిగా మీద పడితే మామూలుగా ఉండదు, అందుకని బౌన్సర్లు అలా వచ్చిన క్రౌడ్ ని కొంచెం నెట్టారు అంతే అని చెప్పుకొచ్చారు నిర్మాత ఎస్‌కేఎన్.
Salar First Single: ఇక చాలు, విసిగిపోయాం.. మాకు ఇప్పుడు కావాల్సిందే అంటున్న ప్రభాస్ ఫాన్స్!
వారిలోనే ఒక లోకల్ మీడియా పర్సన్ కూడా ఉండటంతో ఆయన్ని బౌన్సరు చూసుకోలేదు, మొబైల్ తో వీడియో తీసుకుంటూ ఉంటే మామూలు పర్సన్ అని అనుకున్న బౌన్సర్ పక్కకు తోశాడని అన్నారు. లోకల్ మీడియా పర్సన్ అయితే కెమెరా పట్టుకొని వస్తారు అన్న భావంతో అయన మీడియా కాదనుకుని క్రౌడ్ తో పాటు అతన్ని కూడా నెట్టేశాడని అన్నారు. అలా నెట్టడంలో ఆ మీడియా వ్యక్తి కింద పడిపోగానే, అక్కడ వున్న కొందరు మీడియా మీద దాడి అంటూ వెంటనే నినాదాలు చేసి టీమ్ ప్రయాణిస్తున్న కారును కదలనియం అని ముందు కూర్చున్నారని అన్నారు. అప్పుడు నేను కారు దిగి వాళ్ళ దగ్గరకి వెళ్లి, తాను కూడా 15 ఏళ్లకు పైగా మీడియాలో పని చేసానని, మీడియా అంటే ఎప్పుడూ తనకు గౌరవం అని, ఈ సంఘటన యాదృచ్చికంగా జరిగిన సంఘటన అని చెప్పి అక్కడ వాళ్ళకి సర్ది చెప్పానని అన్నారు. అప్పుడే లోకల్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ పడిపోయిన మీడియా పర్సన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారని ఎక్స్ రే లు కూడా తీయించగా డాక్టర్స్ ఏమీ కాలేదు బాగున్నాడని చెప్పారని అన్నారు. ఆర్థిక సహాయం, మెడిసిన్స్ కి ఏమైనా కావాలన్నా ఇస్తామని చెప్పినా, నాకేమి కాలేదు, ఏమీ అవలేదు, వద్దని చెప్పి వెళ్ళిపోయాడని అని అన్నారు.