Baby is the Fastest 50 crore Gross in Mid Range films: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు తీసి టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ బేబీ. సరైన హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కించారు. జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నా యూత్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. లవ్ లో మోసపోయిన వారందరూ అదేవిధంగా ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిన అందరూ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో సినిమా మీద వసూళ్ల వర్షం కురుస్తోంది.
Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్.. సి.కళ్యాణ్ vs దిల్ రాజు?
అంతేకాదు సినిమా చూసిన సుకుమార్, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీలు సైతం సినిమా తమను అబ్బురపరిచిందంటూ మీడియా ముందుకు వస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు బేబీ మూవీ మరో అరుదైన ఫీట్ సంపాదించింది. మిడ్ రేంజ్ ఫిలిమ్స్ లో వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. బేబీ కల్ట్ బ్లాక్ బస్టర్ అని త్వరగా 50 కోట్లు వసూలు చేసిన సినిమాగా అభివర్ణిస్తూ ఒక పోస్టర్ ని సైతం ఆయన షేర్ చేశారు. అయితే ఈ వారం థియేటర్ల కౌంట్ పెరగడంతో వసూళ్లు కూడా భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఇంకెన్ని కోట్లు వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది అనేది