బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Read Also : RRR : బరోడాలో అడుగుపెట్టిన టీం… ప్రమోషన్స్ కోసం దేన్నీ వదలని రాజమౌళి
“మీరూ మీ అబద్ధాలు !నిజంగా కెప్లర్ ఏం చెప్పాడంటే… జ్యోతిష్యం అనేది గౌరవప్రదమైన, సహేతుకమైన తల్లి ఖగోళశాస్త్రం మూర్ఖపు చిన్న కుమార్తె… బుద్ధి ఉన్నోడు ఎవడన్నా వాట్సప్ చూసి డైలాగులు రాస్తాడా ? తుస్ అంటగా సినిమా… మరేం సినిమా తీసే ముందే చేయి చూపించుకోవాల్సింది విక్రమ్ ఆదిత్యతో” అంటూ “రాధేశ్యామ్” మేకర్స్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అంతేకాదు కెప్లర్ కు సంబంధించిన ఓ లింక్ కు కూడా ఈ పోస్టుకు జత చేశాడు బాబు గోగినేని. అయితే ఆయన వ్యాఖ్యలపై కార్యకర్త, మానవతావాది సినిమాను సినిమాలా చూడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.
