Baak: తమన్నా, రాశి ఖన్నాల ‘బాక్’ వెనక్కి వెళ్ళింది.. ఆరోజే రిలీజ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baak Movie to Release on May 3rd: అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదల తేదీ వాయిదా వేస్తూ కొత్త తేదిని అనౌన్స్ చేశారు. మే 3న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్.
Jaya Jaya jaya Hey: తరుణ్ భాస్కర్ జయజయ జయహే.. ఫైనల్లీ చెప్పేశారు!
Also Read
ఇక అవ్నీ సినిమాక్స్ P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక ఈ సినిమాకి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాదు ఈరోజు రిలీజ్ కావాల్సిన శశివదనే సినిమాతో పాటు లవ్ మౌళి అనే సినిమా కూడా వాయిదా పడింది. అయితే సెన్సార్ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాలో వాయిదా పడ్డట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వచ్చేవారం ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కావాల్సిన దిల్ రాజు కుమారుడు ఆశిష్ రెడ్డి లవ్ మీ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?