Baahubali The Eternal War : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. రెండు పార్టులను కలిపి మొన్ననే రీ రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్లడం.. అక్కడ శివలింగం ముందు డ్యాన్స్ చేయడం ఇందులో కనిపించాయి.
Read Also : Peddi : పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..
బాహుబలి కోసం ఇంద్రుడు, విశాసురుడు భీకరంగా పోరాడుతారు. చివరకు విశాసురుడు ఓడిపోతాడు. బాహుబలి యమలోకానికి వెళ్లడం ఇందులో చూపించారు. చూస్తుంటే ఏదో కొత్త కాన్సెప్టుతో దీన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దీనికి రాజమౌళి సమర్పకుడిగా ఉన్నాడు. ప్రస్తుతం స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి. అయితే స్క్రిప్ట్ కూడా కొత్తగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆకాశలోకంలో బాహుబలి చేసే యుద్ధ విన్యాసాలుగా చూపించబోతున్నట్టు కనిపిస్తోంది.
Read Also : Bandla Ganesh : నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్
