Baahubali : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి స్పెషల్ విషెస్ వచ్చేశాయి. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీల నుంచి స్పెషల్ పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ మూవీ బాహుబలి నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బాహుబలి రెండు పార్టుల షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చేసిన అల్లరి, షూటింగ్ లో ప్రభాస్ మాటలు, సరదాలకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది బాహుబలి టీమ్. ఇందులో ప్రభాస్ అల్లరి మామూలుగా లేదు.
Read Also : Ram Charan – Upasana : ఉపాసనకు ట్విన్స్.. మెగా ఇంట్లో డబుల్ ధమాకా..
మూవీ షూటింగ్ టైమ్ లో ప్రభాస్ ఎంత జోవియల్ గా ఉన్నాడో ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతోంది. ప్రభాస్ ను అందరూ ఇంట్రోవర్ట్ అంటారు గానీ.. ఆయన అందరిలో ఎంత సరదాగా ఉంటాడో ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది. తాను హీరోను అనే గర్వం ఎక్కడా కనిపించకుండా నార్మల్ పర్సన్ గా.. ప్యూర్ స్మైల్ తో ప్రభాస్ ఉండే విధానం అందరికీ నచ్చుతుంది. ఈ వీడియోలో కూడా అదే కనిపిస్తుంది. ఇది చూసిన వారంతా ప్రభాస్ అంటే స్వచ్ఛమైన నవ్వుకు నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Fauzi : పాండవ పక్షం నిలిచిన కర్ణుడు.. ఫౌజీపై క్రేజీ అప్డేట్
A King in strength 👑
A gentle soul at heart ❤️
Wishing our #Baahubali, PRABHAS a very Happy Birthday!#HappyBirthdayPrabhas#BaahubaliTheEpic #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/7KmQxwSZAT— Baahubali (@BaahubaliMovie) October 23, 2025
