యాక్షన్ ఎంటర్టైన్మెంట్కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజానికి కొత్త బాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వెపన్స్‌తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ.. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్‌లో హింసాత్మక చిత్రాల సంఖ్య రానూ రానూ పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్, యానిమల్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత బ్లడ్ షెడ్ సృష్టించాయని మాట్లాడుకుంటే.. ఇప్పుడు వీటిని మించిపోయేలా కనిపిస్తోంది బాఘీ4.
టైగర్ ష్రాఫ్ సినిమాలంటే యాక్షన్, డ్యాన్స్ మూమెంట్స్ లేకుండా ఊహించలేం. కానీ ఈసారి బాఘీ4లో బ్రూటల్ మర్డరర్‌గా మారిపోయాడు. పదునైన వెపన్స్‌తో విలన్స్‌ను వేటాడుతున్నాడు. హీరో మాత్రమే రక్తపాతం ఎందుకు సృష్టించాలనుకున్నాడేమో సౌత్ డైరెక్టర్ హర్ష.. యాంటోగనిస్టు, హీరోయిన్లు సోనమ్ బజ్వా, హర్న సంధుతో కూడా కత్తి పట్టించి.. స్క్రీన్ మొత్తాన్ని రక్తంతో తడిపేశాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు యానిమల్ ని చూసి కేవలం వైలెన్స్ ఉంటె సినిమాలు ఆడేస్తాయనుకుంటున్నారు. బాఘీ 4 టీజర్ చూడటానికే ఎంత జుగుప్సాకరంగా ఉందంటే యానిమల్ సినిమాకి చీప్ కాపీలాగా ఉందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్, మూవీని ఏ లెవల్లో బ్లడ్తో తడిపేయబోతున్నారో అనే డౌట్ కలుగుతోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో సదరు మేకర్స్. అన్నట్టు ఈసినిమాకు దర్శకుడు హర్ష గతేడాది గోపిచంద్‌తో భీమా తీసి ప్లాప్ ఇచ్చాడు.