నిర్మాత వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ట్రెండీ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓ అయ్, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read :Rukmini Vasanth: అభిమానులపై మండిపడిన రుక్మిణి వసంత్..
మేఘాలయలో సంపూర్ణంగా షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా బా బా బ్లాక్ షీప్ కావడం గమనార్హం. ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోందీ సినిమా. ఆరుగురి మధ్య సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. బా బా బ్లాక్ షీప్ గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘మా బా బా బ్లాక్‌షీప్ మేఘాలయాలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం. కథ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి, ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. కథలోనే ఓ బ్యూటీ ఉంటుంది. జలపాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది. ఎన్నో చోట్ల రెక్కీ చేసి, మా కథకు మేఘాలయా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఇక్కడ ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.
ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండే సోహ్రా (చిరపుంజి)లో ‘బా బా బ్లాక్ షీప్’ని తెరకెక్కిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్, ‘బా బా బ్లాక్ షీప్’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. మేఘాలయ ఛీఫ్ మినిస్టర్ మిస్టర్ కన్రాడ్ కె సంగ్మా ఇటీవల సినిమా యూనిట్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయలో షూటింగ్ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.