‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రాల తర్వాత నటుడు, నిర్మాత అచ్యుత రామారావు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ “డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా… వాళ్ళందరి జీవితాల్లో టెన్త్ క్లాస్ మెమరీ అనేది మైల్ స్టోన్ లాంటిది. ఆ అనుభవాలు మిగతా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్టనర్ లాంటిది. ఆ మెమరీస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కొంత మంది జీవితాల్లోజరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను రూపొందించాం. పదోతరగతి చదివిన ప్రతి ఒక్కరినీ ఆ రోజులలోకి తీసుకు వెళుతుంది. దర్శకుడు ‘గరుడవేగ’ అంజి వాణిజ్య హంగులతో వినోదాత్మకంగా తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని నైజాం లో ఏషియన్ సునీల్ కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది’’ అని అన్నారు. ‘సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్ పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, ‘కుర్రవాడా కుర్రవాడా…’ పాటలకు, ప్రత్యేక గీతం ‘సిలకా సిలకా’కు మంచి స్పందన లభించిందని దర్శకుడు ‘గరుడవేగ’ అంజి తెలిపారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.