Avatar 2 : టైమ్ ఆగయా… రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘అవతార్’. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేసిన మాయ ఆయన పేరును తలచుకున్నా చాలు కళ్లముందు కదలాడుతుంది. అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2022 డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పార్ట్స్ కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తరువాత ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్ 2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. నిజానికి 2014లో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సీక్వెల్. ఆ తర్వాత రెండో సీక్వెల్ ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా… మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో, చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయట.
Read also : బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన స్టార్ డైరెక్టర్
ఈ సీక్వెల్స్ లో రెగ్యులర్ తారాగణంతో పాటు, కేట్ విన్స్లెట్, విన్ డీజిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారు. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారు కామెరాన్. ‘అవతార్ 2’లో పండోరలో తెలియని విషయాలను చూపిస్తూ నీటి అడుగున జీవిస్తున్న మెటికెయినా తెగ ప్రజల జీవితాలను ఆవిష్కరించనుంది. మరోసారి అద్భుతమైన లోకాన్ని కళ్ళముందు ఆవిష్కరించబోతున్నారు ‘అవతార్-2’ మేకర్స్.
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!