బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన స్టార్ డైరెక్టర్

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు స్టార్ డైరెక్టర్ సారీ చెప్పారు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి. బాలయ్యకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి నందమూరి అభిమానులకు అసలెందుకు సారీ చెప్పారు అంటే ?

Read Also : ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్!

తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ “నిజానికిది డబుల్ సక్సెస్ మీట్… ముందుగా సారీ బ్రదర్ మిమ్మల్ని ఈ ఈవెంట్ కు పిలవలేకపోయాము అని చెప్పాల్సింది అభిమానులకు. ఎందుకంటే థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. కానీ సక్సెస్ మీట్ ఉంది అంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకే ఫ్యాన్స్ అందరి మంచికోరే మేము వాళ్ళను పిలవలేదు” అంటూ నందమూరి అభిమానులకు సారీ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.

Related Articles

Latest Articles