Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మిగతా హీరోలతో పోలిస్తే.. చై ఒకందుకు వెనుకే ఉన్నాడని చెప్పాలి. అందరూ.. పాన్ ఇండియా.. పాన్ ఇండియా అని వెళ్తుంటే .. చై మాత్రం చాలా సెలెక్ట్‌డ్ గా సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకొకటి దూత అనే వెబ్ సిరీస్ ఇప్పటికే రిలీజ్ కు రెడీ అవుతుంది. డిసెంబర్ 1 న అమెజాన్ లో దూత స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రమోషన్స్ లో చై కష్టపడుతున్నాడు. తాజాగా చై చేసిన ఒక పని.. అభిమానులను ఫిదా చేస్తోంది.
Sound Party Trailer: బిగ్ బాస్ సన్నీ కొత్త సినిమా.. సౌండ్ అదిరేలానే ఉందే
Also Read
తాజాగా చై.. హైదరాబాద్ లో ఉన్న సెయింట్ జూడ్స్ బాలల ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ చిన్నారులతో చై.. చాలా సమయం గడిపాడు. వారితో ఆడి పాడాడు. వారికోసం ఎన్నో గిఫ్ట్ లు తీసుకెళ్లి.. ఆ చిన్నారుల ముఖంలో నవ్వులు కురిపించాడు. చిన్నారులకు కావాల్సిన కొన్ని వస్తువులను సైతం చై వారికి అందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి చై తన సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
At St Judes in Hyderabad, Yuvasamrat @chay_akkineni makes the kids grin ✨
A delightful Children's Day to commemorate with happy children.
The young cancer fighters received the supplies they needed from #NagaChaitanya and spent valuable time with them. pic.twitter.com/2n4VwzjCqY
— Shreyas Media (@shreyasgroup) November 16, 2023
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..