బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే అమ్మడి డ్రెస్సుల విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటూ ఉండే అషూ ఈసారి కూడా ఒక డిఫరెంట్ డ్రెస్ లో కనిపించి మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని హాట్ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఆ ఫోటోలకు ఒక బీభత్సమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.
చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆ డ్రెస్ ఏంటీ .. వీధి కుక్కలు కరిచాయా? అని కొందరు.. మరికొందరు చినిగిన చొక్కా ఏమైనా నీకు ఫ్రీ గా వచ్చిందా..? ఎన్ని వేలు పెట్టి కొన్నావ్.. మల్లు దానికి క్యాప్షన్ ఒకటి. ముందు నువ్వు కొన్న పుస్తకం చూపించు అంటూ ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.