Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది. ఇక బిగ్ బాస్ లో అందాలను ఆరబోసి బయటికి వచ్చి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా వర్మతో శృంగారం గురించి మాట్లాడి ఫేమస్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్ అవకాశం కోసం దేనికైనా రెడీ అంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో రచ్చ రేపింది. ఇక ఆ అందాల పుణ్యమా అంటూ అమ్మడికి ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
అరవింద్ కృష్ణ హీరోగా సుకు పుర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏ మాస్టర్ పీస్.. సినిమా బండి ప్రొడక్షన్స్ నీంరిస్తున్న ఈ చిత్రం అషు రెడ్డి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. తాజాగా మేకర్స్ అధికారికంగా అషును హీరోయిన్ గా ప్రకటించారు. ఇక దీంతో అమ్మడి పంట పడిందని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో అషు వెండితెరకు సెట్ అవుతుందో లేదో తెలిసిపోతోంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
