PadmaVyuham Lo Chakradhari Title launched: యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ అషు రెడ్డి కీలక పాత్రలలో ఒక సినిమా మొదలైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..’పద్మ వ్యూహంలో చక్రధారి’ టైటిల్ , పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని అన్నారు.
Priyanka Singh: కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నా.. ఆ సర్జరీ తరువాత అక్కడ నొప్పి తట్టుకోలేక
ప్రవీణ్ రాజ్ కుమార్, అషు రెడ్డి, శశికా టిక్కో, మధునందన్, భూపాల్ రాజులకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ పేరు చాలా యునిక్ గా ఉందని, కంటెంట్ కూడా భిన్నంగా ఉంటుందని అన్నారు. ప్రవీణ్ రాజ్ కుమార్ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు ఆషు రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో పద్మ అనే పాత్ర చేస్తున్నా, చాలా భిన్నమైన పాత్ర ఇదని అన్నారు. ఇక ఈ సినిమాలో ధనరాజ్, రూప లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్ , మహేష్ విట్టా, వాసు వన్స్ మోర్, బేబీ ప్రేక్షిత, అబ్బా టీవీ హరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.