Ashu Reddy: కొన్నికొన్ని సార్లు రామ్ గోపాల్ వర్మ చేసే పనులకు నెటిజన్లు ఏం అనాలో కూడా తెలియడంలేదు. అదంతా పేరు కోసం చేస్తున్నాడా..? షో కోసం చేస్తున్నాడా..? లేక నెటిజన్లను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడా.. అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. ఇక వర్మతో ఉన్నవారు కూడా ఆయన ఏం చేసినా నోరు మూసుకొని ఉంటే ఫేమస్ అయ్యిపోవచ్చని చేస్తున్నారేమో కూడా తెలియడంలేదు. ముఖ్యంగా ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సింది జూనియర్ సమంత గా ఫేమస్ అయిన అషు రెడ్డి గురించి. అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును రెచ్చగొట్టి విమర్శల పాలవుతుంది. ఇక తాజాగా వర్మతో కలిసి మరింత రెచ్చిపోయింది.
ప్రస్తుతం వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే డేంజరస్ మూవీ గురించి డేంజరస్ లేడీ అయిన అషుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. గతంలో కూడా వీరి కాంబోలో వచ్చిన ఇంటర్వ్యూ రచ్చ రేపిన విషయం విదితమే. ఇక ఈసారి కూడా అదే చేయడానికి ప్రయత్నించారు. ఇక ఈసారి అంతకు మించి చేసారంటే అతిశయోక్తి కాదు. టైట్ డ్రెస్ వేసుకొని సోఫాలో కూర్చున్న అషు కాళ్ళ దగ్గర వర్మ కూర్చొని ఆమెకు పాదపూజ చేశాడు. అంతేకాకుండా ఆమె పాదాలను ముద్దాడుతూ.. వాటిని నోట్లో పెట్టుకొని అరాచకం చేశాడు. ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ `డబుల్ డేంజరస్` అషు రెడ్డితో నాకు ప్రమాదకరం` అని ఆ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఛీ.. ఇంత అసహ్యం.. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా అషు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.