అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ లు కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సస్ ఫుల్ హీరోయిన్స్ అయ్యారు. వీరిలో అనుష్క ఏకంగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. రష్మిక నేషనల్ క్రష్ అయిపొయింది, పూజా హెగ్డే బాలీవుడ్ కి పరిమితం అయ్యింది. ఈ హీరోయిన్ల క్రేజ్ ఆకాశాన్ని తాకడంతో ఇప్పుడు లేటెస్ట్ గా కన్నడ నుంచి కొత్త హీరోయిన్ తెలుగు తెరపై మెరుస్తోంది. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అషిక రంగనాథ్, కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన ఈ బ్యూటీ… తెలుగులో డెబ్యూ మూవీతోనే యూత్ ని అట్రాక్ట్ చేసింది. అమిగోస్ సినిమా సోసోగానే ఆడింది కానీ అషికకి మాత్రం యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు.
2024 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటి క్లీన్ హిట్ గా నిలిచింది. 2024లో టాలీవుడ్ కి సెకండ్ క్లీన్ హిట్ గా పేరు తెచ్చుకున్న నా సామిరంగ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. విలేజ్ అమ్మాయిగా వరలక్ష్మి పాత్రలో అషిక సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ కి అంత ప్రాధాన్యం ఉండదు కానీ ఉన్నంతలో అషిక మెప్పించింది. రెండు వేరియేషన్స్ ఉన్న లుక్ లో అషిక ఆడియన్స్ ని హోల్డ్ చేసింది. గ్లామర్, వార్నింగ్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఇంప్రెస్ చేసిన అషిక… ఓవరాల్ గా నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టి నటిగా మంచి పేరు కూడా తెచ్చుకుంది. దీంతో ఇంకో రెండు మూడు హిట్స్ పడితే చాలు అషిక తెలుగులో సెట్ అయిపోయినట్లే.
Let’s keep rollllllling 🪩🖤 pic.twitter.com/6pcPKmiCAw
— Ashika Ranganath (@AshikaRanganath) January 29, 2024