ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇప్పట్లో తగ్గేలా లేదు. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం సక్సెస్ పార్టీలు, వేడుకలు అన్ని జరుపుకున్నారు. ఇక మరోసారి ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం విదితమే.. ఇక నైజాంలో 100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ సృష్టించడంతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆ ఆనందాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో పాటు పలువురు ప్రముఖులతో షేర్ చేసుకోవడానికి ఆయనే స్వయంగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు.
ఇక ఈ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు జక్కన్న. అంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ గా ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌననే.. కానీ ఈ పార్టీలో మాత్రం అన్నమాట నిలబెట్టుకున్న జక్కన్న గా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్, చరణ్ .. సక్సెస్ పార్టీలో నాటు నాటు స్టెప్స్ కి డాన్స్ వేయాలని అడగగా.. తప్పకుండ వేస్తాను అని జక్కన్న చెప్పడం, ఆయనతో పాటు మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఆ స్టెప్స్ కి డాన్స్ వేయాలని కోరారు. ఇద్దరు కలిసి ఆ స్టెప్స్ వేస్తామని ప్రామిస్ కూడా చేశారు. ఇక ఈ పార్టీలో వారిద్దరూ అన్నమాట మీద నిలబడి నాటు నాటు స్టెప్స్ కి కాలు కదిపారు. అనిల్, రాజమౌళి డాన్స్ పార్టీకే హైలెట్ గా మారింది. ఇక వీరు డాన్స్ వేయడంతో మిగతావారు అరుపులు, కేకలతో ఆ వేదిక హోరెత్తిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Our Director @ssrajamouli fulfilled the promise he made to @Tarak9999 in @AnilRavipudi’s interview. #RRRMovie
THANK YOU
THANK YOU
THANK YOU….🤩🔥🌊🌟 pic.twitter.com/d6iXFmxQ7y
— RRR Movie (@RRRMovie) April 4, 2022