Ram Charan Signed Raj kumar Hirani Next Film: వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఎంచుకుంటున్న కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా పూర్తి స్థాయి స్పోర్ట్స్ బాక్ డ్రాప్ సినిమా అని చెబుతున్నారు. పిరియాడిక్ మూవీ గా చెబుతున్న ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాంచరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయం మీద అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటివరకు రామ్ చరణ్ ఎలాంటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అనేక సినిమాలకు ఆయన పనిచేస్తున్నట్లు ప్రచారాలు అయితే జరిగాయి ఇప్పుడు అలాంటిదే ఒక ప్రచారం బాలీవుడ్ మీడియా వర్గాల్లో జరుగుతోంది.
Rashmi: జైశ్రీరామ్ అన్న రష్మీపై నెటిజన్ అసభ్య వ్యాఖ్యలు.. ఘాటు కౌంటర్ ఇచ్చేసిందిగా!
ఆ ప్రచారం ఏమిటంటే ఈ మధ్యనే రామ్ చరణ్ తేజ ఒక బాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసి చివరిగా డుంకి అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరాణీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడట. ఈ మధ్యనే హిరాణీ రామ్ చరణ్ కి కథ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందని దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. డుంకి ఒక్కటే ఆయన కెరీర్లో కాస్త నిరాశపరిచింది కానీ మిగతా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడమే కాదు భారీ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టాయి. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకి కూడా అలాంటి సీన్ రిపీట్ అవ్వాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది