Shraddha Walker: దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు శ్రద్దా వాకర్. ప్రేమించిన వాడి చేతిలో అతి క్రూరంగా చంపబడిన శ్రద్దా అనే యువతీ కథ ప్రస్తుతం సినిమాగా రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనీష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఢిల్లీలో నివసించే శ్రద్దా.. అఫ్తాబ్ అనే యువకుడిని ప్రేమించింది. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదని బయటికి వెళ్లి అతడితో సహజీవనం మొదలుపెట్టింది. ఇక ఎప్పుడైతే శ్రద్దా.. అఫ్తాబ్ ను పెళ్లి చేసుకోమని అడిగిందో ఆమెకు నరకం మొదలయ్యింది. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు.. కానీ అది అవ్వకపోయేసరికి ఎలాగైనా సర్దాను వదిలించుకోవడానికి ఆమెను అతి కిరాతకంగా చంపి 35 ముక్కలు చేసి తన ఇష్టం వచ్చిన చోటకు విసిరేశాడు.
ఆరు నెలల తరువాత ఈ కేసు బయటికి వచ్చింది. ఇప్పటివారు 13 ముక్కలను పోలీసులు కనుక్కున్నారు. దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతాన్నీ.. ‘హూ కిల్డ్ శ్రద్ధా వాకర్’ అనే పేరుతో సినిమాగా తీయబోతున్నాడు డైరెక్టర్ మనీష్. బృందావన్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు మనీశ్ సింగ్. ప్రేమ ముసుగులో అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు. కామవాంఛలు తీర్చుకొని కొంతమంది అబ్బాయిలు.. సైకోలుగా ఎలా మారుతున్నారు అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. మరి ఈ సినిమాలో శ్రద్దా పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తోందో చూడాలి.