Hello World: ఆర్యన్ రాజేశ్, సదా అప్పుడు థియేటర్లో… ఇప్పుడు ఐటీ కంపెనీలో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryan Rajesh Sada Starring Hello World Web Series Gearing Up For Release: ప్రముఖ దర్శక, నిర్మాత, స్వర్గీయ ఇవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేశ్ ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనా దృష్టి పెట్టాడు. జీ 5 ఒరిజినల్స్ ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ లో రాజేశ్ ఓ కీలక పాత్ర పోషించాడు. విశేషం ఏమంటే ఇందులో సదా మరో ప్రధాన పాత్రను పోషించింది. ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించిన ‘లీలామహల్ సెంటర్’ మూవీ అప్పట్లో చక్కని విజయం సాధించి, వీరిద్దరికి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది.
అప్పుడు థియేటర్ నేపథ్యంలోని సినిమాలో నటించిన వీరిద్దరూ, ఇప్పుడు ఐటీ కంపెనీ బ్యాక్ డ్రాప్ వెబ్ సీరిస్ లో నటిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఓ పెద్ద ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు సంబంధించిన కథ ఇది. వారి అంచనాలకు తగ్గట్టుగా ఆ వర్క్ ప్లేస్ ఉందా లేదా? ఐటీ కంపెనీ జాబ్ తో కెరీర్ ను ప్రారంభించిన వీరు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది? ఈ నేపథ్యంలో ఎనిమిది ఎపిసోడ్స్ గా ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. ‘తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సీరిస్ లు చాలా రేర్ అని, అందువల్ల వీక్షకులకు ఇదో కొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంద’ని దర్శకులు శివసాయి వర్థన్ జలదంకి చెబుతున్నారు.
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
గతంలో శివసాయి ‘గీతా సుబ్రహ్మణ్యం’ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశారు. యంగ్ టెక్కీస్ మెంటాలిటీని తెలియచేసే ఈ ఆఫీస్ డ్రామా ఆగస్ట్ 12 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యాశెట్టి, నిఖిల్ వి సింహా, అపూర్వా రావ్, జి. అనిల్, స్నేహల్ ఎస్ కామత్, రవివర్మ, జయప్రకాశ్ తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. పి.కె. దండి దీనికి సంగీతాన్ని సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ కథ’ తర్వాత నిహారిక కొణిదల ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సీరిస్ ఇది!
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!