Arjun Sarja: కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్యనే లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య సర్జా కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఎప్పటినుంచో ఐశ్వర్య.. కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమను ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించారని, త్వరలోనే వివాహం జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం ఉమాపతి కూడా హీరోగా కొనసాగుతున్నాడు. వీరి పెళ్ళి డిసెంబర్ లో జరగనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
ఇక అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక అర్జున్.. కూతరు ఐశ్వర్యను స్టార్ హీరోయిన్ గా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక టాలీవుడ్ విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్ గా అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలైన విషయం తెల్సిందే. ఆ పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకావడంతో సినిమాపై హైప్ వచ్చింది. కానీ, విశ్వక్, అర్జున్ మధ్య వచ్చిన కొన్ని విబేధాల వలన ఈ సినిమా ఆగిపోయింది. ఇక అదే సినిమాను అర్జున్.. మరో హీరోతో చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.