మరో స్టార్ కపుల్ బ్రేకప్… నీచం అంటూ హీరో కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ఇండస్ట్రీలో చై-సామ్, అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల విషయం అందరికీ అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని, అర్జున్, రియా కపూర్‌తో కలిసి డిన్నర్ పార్టీలో కూడా చేరలేదని వాటి సారాంశం. ఈ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఈ మేరకు మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ తో రిప్లై ఇచ్చారు. అంతేకాదు “నీచమైన పుకార్లకు స్థానం లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమిస్తున్నాను” అంటూ రూమర్స్ కు షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకేముంది దీంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
నగరంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా మలైకా తన విహారయాత్రలను పరిమితం చేసిందని తెలుస్తోంది. ఇక అర్జున్ కపూర్, అతని సోదరి అన్షులా కపూర్, రియా కపూర్, ఆమె భర్త కరణ్ బూలానీలకు కొన్ని వారాల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉండడం గమనార్హం. కొన్ని రోజుల తర్వాత వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఇక అర్జున్, మలైకా కొన్ని సంవత్సరాల క్రితం తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అర్జున్ కపూర్ తన కంటే 15 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో డేటింగ్ ప్రారంభించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. కానీ వీరిద్దరి మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!