Arjun Kapoor: మలైకాతో పెళ్లికి రెడీగా లేనంటూ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Kapoor On Marriage With Malaika Arora: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం అందరికీ తెలిసిందే! మొదట్లో తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా నడిపిన ఈ జంట.. ఆ తర్వాత ఓపెన్ అయ్యింది. ఈమధ్య కాలంలో అయితే వీళ్లు తెగ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతున్నారు. అసలు తమలాంటి మరొకటి ఉండదన్నట్టుగా.. తెగ హడావుడి చేస్తున్నారు. ఈ హంగామా చూసే, వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న రూమర్లు పుట్టుకొచ్చేశాయి. బాలీవుడ్ ప్రేమజంటలు ఈమధ్య పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న నేపథ్యంలో.. ఈ జంట కూడా పెళ్లికి సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
అయితే.. ఈ వార్తలపై తాజాగా అర్జున్ కపూర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు. ‘కాఫీ విత్ కరణ్ షో’కి గెస్ట్‌గా వచ్చిన అర్జున్.. మలైకాతో పెళ్లి చేసుకునేందుకు తానిప్పుడే సిద్ధంగా లేనని బాబ్ పేల్చాడు. కొవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక ఖాళీగా సమయం గడపాల్సి వచ్చిందని, ఇప్పుడు తాను తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని వివరించాడు. తన పని తనకు సంతోషాన్ని కలిగిస్తుందని, తాను సంతోషంగానే ఉన్నప్పుడే భాగస్వామిని సంతోష పెట్టగలనని అన్నాడు. ప్రస్తుతానికైతే తనకు పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి, అర్జున్ చేసిన కామెంట్స్‌పై మలైకా అరోరా ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!