Arjun Kalyan Babu movie gearing up for Release: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న సినిమా ‘బాబు’, ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు కాదా విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నారు మేకర్స్.
Fake Collections: ముదురుతున్న ఫేక్ కలెక్షన్స్ వివాదం.. ఆ వెబ్ సైట్స్ కి నోటీసులు?
తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు, ఎంఎల్ఆర్, సోనాలి, మురళీధర్ గౌడ్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రవి వర్మ, సునీత మనోహర్, అశోక్ వర్ధన్, భద్రి జార్జి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి పవన్ సంగీత దర్శకుడు కాగా పీఎస్ మణికర్నన్ కెమెరామెన్ గా డి. వెంకటప్రభు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి కుషిత కల్లపు సంవత్సరాల తరబడి అనేక యూట్యూబ్ వీడియోలు చేసినప్పటికీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు రాలేదు కానీ ఒకే సంఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది.