Bhola Shankar: బోళా శంకర్‌కు షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ap Governement Refuses Bhola Shankar Ticket Price hike: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. షాడో లాంటి డిజాస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా రేట్లు పెంచి అమ్ముకుంటామని సినిమా నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 25 రూపాయల మేర పెంచుకుని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆ అనుమతులు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!
Also Read
దీంతో ఏపీ ప్రభుత్వం చిరంజీవి మీద విరుచుకుబడింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక రేంజ్ లో ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పెంపు అసాధ్యం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా పెంపు ప్రపోజల్ను ప్రభుత్వం తిరస్కరించిందని ప్రచారం జరుగుతోంది. నిజానికి భోళా టీం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డాక్యుమెంట్లు సమర్పించాలని భోళా శంకర్ టీం కి చెప్పామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిజంగా సినిమా టికెట్ రేటు పెంపుదల ప్రపోజల్ను ప్రభుత్వం తోసిపొచ్చిందా? లేక అది ప్రచారమేనా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద అధికారులు అధికారికంగా ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
-
Trump: అణు తనిఖీలు, హార్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
-
Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!