Anushka : సొంత ప్రొడక్షన్ హౌజ్ నుండి తప్పుకున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్లీన్ స్లేట్ ఫిలింజ్’ని అక్టోబర్ 2013లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థలో NH10, ఫిల్లౌరీ, పారి, పాతాల్ లోక్, బుల్బుల్ వంటి అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే ఇప్పుడు అనుష్క క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన సుదీర్ఘ హృదయపూర్వక నోట్‌లో అనుష్క తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Read Also : Bigg Boss Non Stop : మూడవ వారం ఎలిమినేషన్… ఆర్జే అవుట్
Also Read
“ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ @kans26 @officialcsfilms! నా శుభాకాంక్షలు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి!” అంటూ రాసుకొచ్చింది అనుష్క. “నేను నా సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలింజ్‌ని ప్రారంభించినప్పుడు, ప్రొడక్షన్ విషయానికి వస్తే మేము కొత్తవాళ్లమే… కానీ మేము భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ ఎజెండాను ప్రయత్నించాలని అనుకున్నాము. ఈ రోజు నేను ఇప్పటివరకు జరిగిన మా ప్రయాణాన్ని తిరిగి చూసుకున్నప్పుడు, మేము సృష్టించి, సాధించగలిగిన దాని గురించి చాలా గర్వపడుతున్నాను. కమర్షియల్ ప్రాజెక్ట్‌లు ఎలా ఉండాలి అనే కథనాన్ని మార్చాలనే నా దృష్టితో CSF ప్రారంభించినప్పటికీ, ఈ రోజు CSFను ఇలా మలచడంలో అద్భుతంగా పని చేసిన కర్నేష్‌కి ఈ ఘనత లభిస్తుంది” అని రాసుకొచ్చింది. “నా లైఫ్ ను నటనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను! అందువల్ల అత్యంత సమర్ధుడైన వ్యక్తి కర్నేష్ మొదట రూపొందించిన విజన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మకంతో నేను CSF నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నేను CSF కోసం చీర్‌లీడర్‌గా కొనసాగుతాను. CSF కుటుంబానికి నా శుభాకాంక్షలు. మీ అందరినీ ప్రేమిస్తున్నాను” అని అనుష్క ముగించింది.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!