అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునం ఈ బ్యూటీ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. అయినా అమందు చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది. ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ” ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాల ఇస్తామని హీరోయిన్లను లోంగబర్చుకొనే సంస్కృతి టాలీవుడ్ లోనూ ఉంది. నేను కూడా చూశాను అలాంటివి. ఇది ఒక్కచోటే కాదు ప్రతి ఇండస్ట్రీలోను ఉన్నాయి.
ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. అవును టాలీవుడ్ లో కూడా ఈ లైంగిక వేధింపులతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనే నేను ఒప్పుకుంటున్నాను. నా మనస్తత్వం తెలిసి నా దగ్గర ఎప్పుడు ఎవరు ఇలా అడగలేదు”. అని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఏంటా అని అందరు తలలు బాదుకుంటున్నారు. మరి అనుష్క ఇలా మాట్లాడం వెనుక కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.