టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయిన చిత్రం అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి నీరాజనాలు అందుకొంది. స్వీటీ జేజమ్మగా అందరి మనస్సులో కొలువుండిపోయింది. ఇక అయి సినిమా విడుదలై నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
” అరుంధతి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. జేజమ్మ పాత్ర నా జీవితంలో అలాంటిందే. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణగారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి, అరుంధతి టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపింది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పశుపతి పాత్రలో సోనూసూద్ నటన ఇప్పటికి ప్రతి ఒక్కరి కళ్ళముందు కదులుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ కాలం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన తీసిన ఇలాంటి సినిమాతో ఎప్పుడు గుర్తుంటునే ఉంటారు.